Tuesday, November 20, 2012

పేరులోని తీపి

చం:-

శివయను మాట బిందువయి జిహ్వను తాకినయంత తానుగా
అవిరళమైన తీపి చని ఆవలి సంగతులెల్ల మాయమౌ
దివిధుని పాపరాశులను తీర్చినయట్టుల నాదు హృత్తునన్
భవలవభావతాపములు భంజనమొందును భక్తివాహినిన్


3 comments:

కామేశ్వరరావు said...

చాలా బాగుంది!
"చేరినయంతనే" బదులు "తాకినయంతనే" అంటే ఇంకా బాగుంటుందేమో.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చక్కటి భావన. చక్కటి వ్యక్తీకరణ.
చిన్న సవరణ చెప్తాను.

మదిన్ + అ సంధి అవుతుంది.
కాబట్టి " యంత దానుగా నవిరళమగు తీపి యగు నావలి సంగతులెల్ల మాయమౌ."
చని అంటే వెళ్ళి అని అర్థం కదా కాబట్టి యగు అనాలని నా అభిప్రాయం.
ఇంక "లవ" అనే పదం ఏమిఅని అర్థం కాలేదు. దయచేసి చెప్పరా?

Sandeep P said...

@భైరవభట్ల వారు: మీ సూచన బాగుంది. పద్యం సవరించానండి. నెనర్లు.

@లక్ష్మీ దేవి గారు: మీరన్నది నిజమే. పద్యం మీరన్నట్టు సవరించాను. నెనర్లు. "చని" అంటే వెళ్ళి అనే అర్థమే కాక "మొదలై", "కలిగి" అని కూడా అర్థం ఉంది అండి. ఉదాహరణ పద్యం గుర్తుకు రావట్లేదు. ఈ సారి ఏదైనా పద్యం చదువుతుంటే స్ఫురించగానే చెప్తాను.